సొంతింటి కల నెరవేర్చిన ప్రజాప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేర్చిన ప్రజాప్రభుత్వం

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

సొంతింటి కల నెరవేర్చిన ప్రజాప్రభుత్వం

ఎల్కతుర్తి : ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేర్చామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలిపారు. మండలకేంద్రంలోని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కందుకూరి జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన దీపావళి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా గృహ నిర్మాణానికి దూరమైన పేదలకు అండగా నిలిచేందుకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జ్యోతి కుటుంబానికి నూతన వస్త్రాలు, స్వీట్స్‌ అందించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో ఆర్డీఓ వెంకట్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్‌, ఎంపీడీఓ విజయ్‌కుమార్‌, ఏడీ ఆదిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ముప్పు శ్రీనివాస్‌, సుకినె సంతాజీ, ఇంద్రసేనారెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్‌, వెంకటేష్‌, మండ సుమన్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ

మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి

దీపావళి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement