ధర్మసాగర్ మండలం ముప్పారం, మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చారు. లబ్ధిదారుల కుటుంబాలకు స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు రేణుక, మాచెర్ల జ్యోతి ఏలీయా, డీఆర్డీఏ పీడీ మేన శ్రీను, తహసీల్దార్ బావుసింగ్, ఎంపీడీఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు. – ధర్మసాగర్
ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు మడిపల్లి కావేరి– పవన్ దంపతుల ఇంట్లో ఆదివారం దీపావళి వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని లబ్ధిదారు కుటుంబానికి నూతనవస్త్రాలు, మిఠాయి అందించారు. సర్పంచ్ మహేందర్, గృహ నిర్మాణశాఖ పీడీ సిద్ధార్థ నాయక్, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. – ఆత్మకూరు


