దీపావళి రోజు దీపతోరణాలు వెలిగించే ఆచారం ఉంది కాబట్టి దీపావళి పండుగగా పిలుస్తారు. ఈరోజున శ్రీమహా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికి తిరుగుతుందని భావిస్తారు కాబట్టి ప్రజలు శ్రీమహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. మట్టి ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి, వత్తులు వేసి దీపాలు వెలిగించడం సర్వశ్రేష్టం. దీపాల వరుసను వృక్షాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది. పురాతనమైన శివాలయాల్లో దీపదానం చేయడం, దేవాలయాల్లో దీపాలు వెలిగించడం సంప్రదాయం. ఇంటిలోని ఏ మూలలోనూ చీకటి లేకుండా చూడాలి. తెలంగాణలో జానపదుల దీపావళి పండుగ రోజున ఎల్లమ్మదేవతను కూడా పూజిస్తారు.
– ఆరుట్ల శ్రీనివాసాచార్య స్వామి, శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రం
నిర్వాహకులు, హనుమకొండ


