విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

న్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కాలేజియేట్‌ విద్యా, అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రగతి, విద్యార్థుల ప్రవేశాలు, పరీక్షా ఫలితాలు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) వైవీ గణేష్‌, జిల్లా కాలేజియేట్‌ విద్యా అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మల్లం నవీన్‌, కమిటీ సభ్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

మిల్లు భూమిపై నివేదిక సమర్పిస్తాం

ఆజంజాహి మిల్లు పూర్వ కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ సుప్రీంకోర్టును కార్మికులు ఆశ్రయించారు. కాగా, కోర్టు ఆదేశానుసారం ఇంటి స్థలాల కేటాయింపు విషయంపై వాస్తవ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని కలెక్టర్‌ సత్యశారద తెలిపారు.

భూసమస్యపై నివేదిక సమర్పించాలి

భూసమస్యపై జక్కలొద్దికి చెందిన బాధితురాలు వెంకటమ్మ ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తుపై ఆమె కుటుంబ సభ్యులతో కలెక్టర్‌ సత్యశారద కలెక్టరేట్‌లో శనివారం హియరింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటమ్మ భూ సమస్యను పరిశీలించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్‌ సత్యశారద కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగ పద్మజ, ఏపీడీ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల గోదాం తనిఖీ

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఈవీఎంల గోదాంను కలెక్టర్‌ సత్యశారద శనివారం తనిఖీ చేశారు. గోదాంలో ఈవీఎంల భద్రత, సీసీ టీవీ నిఘా, ప్రవేశ నియంత్రణ, రికార్డుల నిర్వహణను ఆమె పరిశీలించారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement