సీతంపేట @ బతుకమ్మ దీపావళి | - | Sakshi
Sakshi News home page

సీతంపేట @ బతుకమ్మ దీపావళి

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

సీతంపేట @ బతుకమ్మ దీపావళి

హసన్‌పర్తి: బతుకమ్మ వేడుకలు దసరాకు ముందు రోజుల్లో జరుపుకోవడం ఆనవాయితీ. కానీ, హసన్‌పరిత మండలం సీతంపేటలో మాత్రం దీపావళి సందర్భంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రత్యేకత. ఇక్కడ 200 ఏళ్లుగా దీపావళి పర్వదినం నుంచి మూడు రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాలు ఆ గ్రామానికి చెందిన నేతకాని సామాజిక వర్గానికి ప్రత్యేకం. ఇప్పటికే సామాజికవర్గ ఆడపడుచులు, బంధువులు గ్రామానికి తరలివచ్చారు. ప్రతిఇంటా సందడి నెలకొంది.

చెరువు నుంచి నల్లమట్టి సేకరణ

వేడుకలను పురస్కరించుకుని తొలిరోజు నేడు (ఆదివారం) చెరువు నుంచి మట్టిని సేకరిస్తారు. పురుషులు మాత్రమే చెరువు వద్దకు వెళ్లి మట్టిని తీసుకొస్తారు. వాటితో జోడెడ్ల (జోడెడ్ల ప్రతిమలు) తయారు చేస్తారు. సాయంత్రం కేదారేశ్వరస్వామి వ్రతం ఆచరిస్తారు. అనంతరం జోడెడ్ల ప్రతిమలను ప్రత్యేక గదిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.

జోడెడ్ల ప్రతిమల నిమజ్జనం

రెండో రోజు (సోమవారం) ఇళ్లలోని ప్రత్యేక గదిలో ప్రతిష్ఠించిన జోడెడ్ల ప్రతిమలతో సామాజికవర్గ యువకులు భక్తిపరమైన పాటలు పాడుతూ గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. అనంతరం జోడెడ్ల ప్రతిమలను స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. కేదారేశ్వర వ్రతం విరమిస్తారు.

తరలివచ్చిన బంధుగణం

ఈ వేడుకల కోసం రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహా రాష్ట్రలో స్థిరపడిన నేతకాని సామాజిక వర్గానికి చెందిన వారు సీతంపేటకు తరలివచ్చారు. తమ బంధువులతో కలిసి మూడు రోజులపాటు ఉత్సవాల్లో మునిగి తేలు తారు. ఈ ఉత్సవాలు తిలకించడానికి సీతంపేటలపాటు చుట్టు పక్కల గ్రామస్తులు కూడా వస్తారు. నేతకాని దీపావళి వేడుకలను పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రదేశంలో వీధి లైట్లతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించినట్లు సర్పంచ్‌ రమ్య తెలిపారు.

200 ఏళ్లుగా వస్తున్న నేతకాని

కులస్తుల ఆచారం

నేటినుంచి మూడు రోజులపాటు

సంబురాలు

చివరి రోజు పురుషులు సైతం

బతుకమ్మలతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement