బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

గీసుకొండ: క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీ పోటీల్లో బొడ్డుచింతలపల్లి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిందని, ఈ క్రమంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని డీపీఓ కల్పన సూచించారు. గ్రామంలో చేపట్టిన జలసిరి పనులతో పాటు పల్లెప్రకృతి వనాన్ని శనివారం పరిశీలించారు. పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, కంపోస్టు ఎరువు తయారీ, ప్లాస్టిక్‌ వాడకం నివారణను పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం డీపీఓ ఎలుకుర్తి హవేలి గ్రామంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ శ్రీధర్‌, సర్పంచ్‌లు పోగుల వనిత, దివ్యభారతి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

డీపీఓ కల్పన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement