జలసిరి పనులు త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

జలసిరి పనులు త్వరగా పూర్తిచేయాలి

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

గీసుకొండ: గ్రామాల్లో వీబీ జీరాంజీ కింద చేపట్టే జలసిరి పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ వసంత సూచించారు. మండలంలోని మచ్చాపూర్‌, కొనాయమాకుల, హర్జ్యతండా గ్రామాల్లో చేపట్టిన పనులను శనివారం పరిశీలించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద చేపట్టే డ్రైవ్‌ ఎండ్‌ సోక్‌ పిట్‌ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘం భవన నిర్మాణం, ఇంకుడు గుంతలు, రూఫ్‌ టాప్‌ హార్వెస్టింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీఓ భవనాలను ఈనెల 19 లోపు సిద్ధం చేయాలన్నారు. ఆమె వెంట ఏంపీడీఓ శ్రీధర్‌, పీఆర్‌ ఏఈ అనిల్‌కుమార్‌, ఈసీ శ్రీలత, టీఏలు సత్యనారాయణ సింగ్‌, సుష్మ, సర్పంచ్‌లు వజ్ర రాజు, వీరన్న, పంచాయతీ కార్యదర్శులు రామారావు, శాంత, సునీత, ఎఫ్‌ఏలు రాజ్‌మహ్మద్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ వసంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement