వీరభద్రుడి జాతర టెండర్లకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

వీరభద్రుడి జాతర టెండర్లకు విశేష స్పందన

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

● కొబ్బరికాయలు, పూజా సామగ్రి హక్కు రూ.14.61 లక్షలు

● మిగతా టెండర్లు 16వ తేదీకి వాయిదా

భీమదేవరపల్లి: మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో 2027 సంవత్సరం జాతరకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన టెండర్‌ కమ్‌ బహిరంగ వేలానికి విశేష స్పందన లభించింది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేలంలో.. వివిధ విక్రయాల హక్కును భక్తులు, వ్యాపారులు పోటీపడి దక్కించుకున్నారు. ఆలయ ఈఓ కిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. దేవస్థానంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయించేందుకు కొత్తకొండ గ్రామానికి చెందిన కొక్కరకొండ రాజు రూ.14,61,000 దక్కించుకున్నారు. అలాగే గుమ్మడి కాయలు, కోరమీసాలు అమ్ముకునే హక్కును అదే గ్రామానికి చెందిన చెంగల కొమురయ్య రూ.10,47,000కు, తలనీలాలు సేకరించే హక్కును కొత్తకొండకు చెందిన కొలిపాక కొమురయ్య రూ.17,500కు పొందారు. జాతర ఏర్పాట్లలో భాగంగా టెంట్‌ హౌస్‌ సప్లై చేసేందుకు కొత్తకొండకు చెందిన బుర్ర సమ్మయ్య రూ.1,35,000కు, తడకలు, పందిళ్లు వేసేందుకు హుస్నాబాద్‌కు చెందిన ములంగూరి చందు రూ.90,000కు, లైటింగ్‌, డెకరేషన్‌ పనులను కొత్తగట్టుకు చెందిన ఉమ్మెత్త నిరంజన్‌రెడ్డి రూ.1,90,000కు టెండర్‌ ద్వారా దక్కించుకున్నారు. మిగిలిన ఇతర విభాగాల టెండర్లను ఈనెల 16వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.కిషన్‌రావు, గ్రామ పెద్దలు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement