రైతుకు విపత్తి | - | Sakshi
Sakshi News home page

రైతుకు విపత్తి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

తగ్గిన దిగుబడి.. పెరిగిన కూలి రేట్లు

సాక్షి, వరంగల్‌: వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో పత్తి పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది. గతంలో ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం రెండు నుంచి ఐదు క్వింటాళ్లకే పరిమితమవుతోంది. దీనికితోడు పత్తి ఏరేందుకు కూలి రేట్లు సైతం పెరిగాయి. ఒకవైపు దిగుబడి తగ్గడం.. మరోవైపు పెట్టుబడులు, కూలీ ఖర్చులు పెరగడంతో రైతులకు సాగు భారంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది 1,20,110 ఎకరాల్లో పత్తి సాగైంది. సరాసరి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో రైతులు చెబుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, సంగెం, ఖిలా వరంగల్‌, నెక్కొండ, పర్వతగిరి, వరంగల్‌ను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.

దిగుబడి సగానికి సగం..

ఈసారి పత్తి దిగుబడులు సగానికి సగం తగ్గడానికి వర్షాభావ పరిస్థితులే ప్రధాన కారణం. పంట ఎదుగుదల, పూత, కాయ దశల్లో తగినంత తేమ అందకపోవడంతో మొక్కలు పెరగలేదు. పూత, కాయలు నిలవకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. సాధారణంగా ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే పొలాల్లో ఈసారి రెండు నుంచి ఐదు క్వింటాళ్లే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.

కూలి రేట్లతో మరింత భారం..

పత్తి ఏరేందుకు పెరిగిన కూలి రేట్లు పెరగడం కూడా రైతులకు గుదిబండగా మారాయి. గతంలో ఒక్కో కూలీకి రోజుకు రూ.400 వరకు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.500 నుంచి అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తోంది. కూలీల కొరత కారణంగా సమయానికి పత్తి ఏరలేకపోతున్నారు. తక్కువ దిగుబడి వచ్చినా కూలీలకు చెల్లించాల్సిన ఖర్చు తగ్గడం లేదు. దీంతో రైతుకు మిగిలే ఆదాయం మరింత కరిగిపోతోంది.

ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లే

చేతికి వస్తున్న పంట

రూ.400 ఉన్న కూలి రేటు రూ.500కు పెంపు

మార్కెట్‌లో పడిపోతున్న కాటన్‌ ధరలు

పెట్టుబడి కూడా రావడం లేదని

రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement