న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో భూములు కోల్పోయిన వారికి కేటాయించిన రాజీవ్‌గాంధీ టౌన్‌షిప్‌లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. టౌన్‌షిప్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీపీ భవనం, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రి తదితర నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. పనుల నాణ్యతలో రాజీపడకుండా నిరంతరం పర్యవేక్షించాలని వారు సూచించారు. సమీక్షలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, జోనల్ మేనేజర్ స్వామి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్ పాల్గొన్నారు.
స్వచ్ఛమైన తాగునీరందించాలి
న్యూశాయంపేట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నీటి సరఫరా, పారిశుద్ధ్య మిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11 నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించాలని, ఈనెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, జెడ్పీ సీఈఓ వసంత, ఆత్మ పీడీ విజయనిర్మల పాల్గొన్నారు.
డెంగీ, మలేరియా నియంత్రణ చర్యలు చేపట్టాలి
జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పురోగతి లక్ష్యాల సాధనపై వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద


