వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

క్రీడాకారులకు ఇంక్రిమెంట్స్‌

జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే పోలీస్‌ క్రీడాకారులకు ఇంక్రిమెంట్స్‌ అందజేస్తామని మల్టీజోన్‌–1 ఐజీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు.

జ్వరం తీవ్రంగా ఉండడంతో వర్ధన్నపేటకు చెందిన ఓ బాధితుడిని కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల్లో డెంగీ నిర్ధారణ కావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ప్రారంభించారు. బెడ్‌ చార్జీలు, పరీక్షలు, మందులు, వైద్యుల ఫీజులు కలిపి బిల్లు భారీగా పెరిగింది. అత్యవసర పరిస్థితి కావడంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి మరీ రూ.లక్షల్లో బిల్లు చెల్లించారు.

నగరానికి చెందిన ఒకరు డెంగీ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లారు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మరిన్ని పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు. చికిత్స సమయంలో ప్రతిసారీ కొత్త పరీక్షలు, మందుల ఖర్చులు పెరుగుతుండడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాలా? చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? అనే విషయాలపై ముందుగానే స్పష్టత ఇవ్వాల్సిన వైద్యులు క్లారిటీ ఇవ్వకపోవడంతో వైద్య ఖర్చులు చెల్లించేందుకు ఇబ్బందిపడ్డారు.

సాక్షి, వరంగల్‌:

జిల్లాలో జ్వరాలు, డెంగీ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వాతావరణ మార్పులు, దోమలతో వరంగల్‌ నగరంలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది 10 నెలల్లోనే 6,580 జ్వర కేసులు, 164 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులే ఇంత భారీగా ఉంటే.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అత్యవసర వైద్యం పేరుతో రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి.

జ్వరమొస్తే జేబుకు చిల్లే..

సాధారణ జ్వరం వచ్చినా ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి అనేక కుటుంబాల్లో కనిపిస్తోంది. జ్వరం తగ్గకపోతే డెంగీ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల అనుమానంతో రక్తపరీక్షలు చేయిస్తున్నారు. వైద్యుల కన్సల్టేషన్‌ ఫీజు, రక్త పరీక్షలు, మందులు, స్కానింగ్‌, బెడ్‌ చార్జీలు కలిపితే సాధారణ జ్వరానికే రూ.వేలు ఖర్చవుతున్నాయి.

వైద్యారోగ్యశాఖ పర్యవేక్షించాలి..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, పరీక్షల చార్జీలు, బెడ్‌ అద్దెలు, ఐసీయూ ఖర్చులపై వైద్యారోగ్యశాఖ నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, వైద్యుల అర్హతలు, అందిస్తున్న సేవలు, రోగులకు ఇస్తున్న బిల్లుల విషయంలో తనిఖీలు నిర్వహించాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే విచారించి చర్యలు తీసుకోవాలి. కానీ, క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా తనిఖీలు తప్ప నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు రోగుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఆయా ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తమకు సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డి అన్నారు.

ఖిలావరంగల్‌లో ఉంటున్న ఒకరికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తొలుత రక్త పరీక్షలు, అనంతరం మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల కన్సల్టేషన్‌, పరీక్షలు, మందులు కలిపి రెండు మూడు రోజుల్లోనే రూ.20వేల వరకు ఖర్చయ్యాయి. జ్వరం తగ్గినా చేతిలోని డబ్బులు ఖాళీ అయ్యాయని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

164 డెంగీ కేసులు

10 నెలల్లో 6,580 ఫీవర్‌,

ప్లేట్‌లెట్ల పేరుతో భయం..

డెంగీ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం సహజం. ప్రతి డెంగీ బాధితుడికి ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరముండదు. వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స అందించాలి. అయినప్పటికీ ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయంటూ కొంతమంది బాధితులను, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి ఆస్పత్రిలో చేర్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూ, ప్రత్యేక బెడ్లు, అదనపు పరీక్షల పేరిట రూ.లక్షల బిల్లులు వేస్తున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఫీజుల వివరాలు ఆస్పత్రిలో ప్రదర్శించాల్సి ఉన్నా వైద్యులు పాటించడం లేదన్న విమర్శలున్నాయి.

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

అత్యవసర వైద్యం పేరుతో రూ.లక్షల్లో

వసూలు చేస్తున్న ప్రైవేట్‌ హాస్పిటల్స్‌

ఫీజుల దోపిడీపై వైద్యారోగ్యశాఖ

అధికారుల నిఘా కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement