కాళోజీ సెంటర్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించేందుకు జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనలకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈనెల మూడో వారంలో ‘ఇన్‌స్పైర్ అవార్డ్స్– మనాక్ 2025–26’, ‘రాజ్యస్థాయి బాలవైజ్ఞానిక ప్రదర్శన (ఆర్‌ఎస్‌బీవీపీ) 2026–27’ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఎన్.ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, సైన్స్ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
సమస్యలకు పరిష్కారం చూపే
మోడల్స్ రూపొందించాలి..
జిల్లా నుంచి ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికైన 144 మంది విద్యార్థులు జిల్లా స్థాయి ప్రదర్శనలో తప్పనిసరిగా పాల్గొనాలని డీఈఓ స్పష్టం చేశారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) ద్వారా ఎంపికై న ప్రతి విద్యార్థి ఖాతాలో ప్రాజెక్టుల తయారీ కోసం ఇప్పటికే రూ.పది వేల చొప్పున జమ అయ్యాయని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా, తక్కువ ఖర్చుతో, నిత్యజీవిత సమస్యలకు పరిష్కారం చూపేలా వినూత్న వర్కింగ్ మోడల్స్ రూపొందించాలని విద్యార్థులకు సూచించారు. మార్కెట్‌లో కొనుగోలు చేసిన నమూనాలు కాకుండా, విద్యార్థుల సొంత ఆలోచనలకు గైడ్ టీచర్లు సాంకేతిక సహకారం అందించాలని ఆదేశించారు.
వికసిత్ భారత్ థీమ్..
ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన ‘సైన్‌్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ సస్టైనబుల్ అండ్ వికసిత్ భారత్’ థీమ్‌తో ఈ ఏడాది రాజ్యస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన (ఆర్‌ఎస్‌బీవీపీ) సాగనుంది. ఈ పోటీలను జూనియర్స్ (6–8 తరగతులు), సీనియర్స్ (9–12 తరగతులు) విభాగాల్లో అధికారులు నిర్వహిస్తారు.
ఉపాధ్యాయులు, డీఎడ్, బీఎడ్ విద్యార్థులకు సైతం అవకాశం
ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విభాగంలో ఉపాధ్యాయులు, డీఎడ్, బీఎడ్ శిక్షణార్థులకు కూడా ప్రదర్శనలు నిర్వహించే అవకాశం కల్పించారు. వీటిలో ఉత్తమ నమూనాలను కూడా రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. వీటితో పాటు ‘స్టెమ్ ఫర్ క్లైమేట్ యాక్షన్’, ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్’ అంశాలపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ నిర్వహించి, విజేతలను రాష్ట్రస్థాయికి పంపిస్తారు.
విపత్తుల నిర్వహణ
ప్రతి ఉప అంశం నుంచి, ప్రతి విభాగంలో అత్యుత్తమంగా నిలిచే ఏకసభ్య (ఒక్కరు మాత్రమే పాల్గొనే) ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలి..
ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలను విజయవంతం చేయడానికి ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలి. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ప్రయోగశాలలను సమర్థవంతంగా వాడుకుంటూ విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వాలి. సూచించాం. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, గైడ్ టీచర్ల వివరాలను గూగుల్ ఫామ్ ద్వారా జిల్లా కార్యాలయానికి సమర్పించాలి. విద్యార్థులు జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలి.
– ఎన్.ప్రశాంత్‌రెడ్డి, డీఈఓ
జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్– మనాక్, ఆర్‌ఎస్‌బీవీపీ పోటీలు
144 మంది ఇన్‌స్పైర్ విజేతలకు రూ. పదివేల చొప్పున నిధులు
ప్రదర్శనలోని ప్రధాన ఉప అంశాలు
మెరుగైన జీవనం కోసం కత్రిమ మేధస్సు (ఏఐ)
హరిత ఇంధనం, పర్యావరణ పరిరక్షణ
గణిత నమూనాలు, కంప్యూటేషనల్ థింకింగ్
ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం
స్థానిక వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ పరివర్తన కోసం విజ్ఞానశాస్త్రం


