ఎన్నికలపై వ్యాసరచన, క్విజ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలపై వ్యాసరచన, క్విజ్‌ పోటీలు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

హన్మకొండ అర్బన్‌: యువతలో ఓటు హక్కు ప్రాముఖ్యం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సూచించారు. ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. వీసీలో హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేష్‌, డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్లు రవీందర్‌ రెడ్డి, భావ్‌సింగ్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వరంగల్‌ కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, వైవీ గణే్‌ష్‌, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్‌ డీఓలో సుమ, ఉమారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement