నిర్మాణ పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులు వేగవంతం చేయండి

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

● కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లావ్యాప్తంగా వివిధ దశల్లో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇనన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ శేషాద్రి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఈఈ రాజగోపాల్‌రావు, డీఈలు, ఎంపీడీఓలు, ఇతర ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ

హనుమకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్‌ సమీపంలోని ఈవీఎంలు భద్రపర్చిన గోదాంను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ గురువారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈసందర్భంగా గోదాంకు వేసిన సీళ్లను పరిశీలించారు. గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి

రాబోయే యాసంగి సీజన్‌న్‌లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఖేత్‌ బచావో యోజనలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఏఓ విజయ్‌ చంద్ర, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, అవినాష్‌ వర్మ, సాంకేతిక వ్యవసాయ అధికారి కమలాకర్‌, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement