నిబంధనల మేరకు ధాన్యం కొనాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు ధాన్యం కొనాలి

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

● హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కమలాపూర్‌: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ధాన్యంలో తరుగు పేరిట కోతలు విధించకుండా నిబంధనల ప్రకారం ధాన్యం కొనాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని గూడూరు, కమలాపూర్‌, ఉప్పల్‌, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్‌పర్సన్‌ తౌటం ఝాన్సీ రవీందర్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు రైతులకు సాగు నీరు, కరెంటు సమస్య రాలేదని, కాంగ్రెస్‌ రాగానే మళ్లీ కరెటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. అనంతరం సెర్ప్‌–డీఆర్డీఏ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు ప్రారంభించారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్‌ సత్యనారాయణరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేశ్‌, కేడీసీసీబీ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌, డీసీఓ మోహన్‌, డీఎం మహేందర్‌, తహసీల్దార్‌ సురేశ్‌కుమార్‌, ఎంపీడీఓ గుండె బాబు, డీటీ నాగేంద్రప్రసాద్‌, సీఈఓ వెంకటేశ్‌, ఏపీఎం లలితాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, సీసీలు, రైతులు, నిర్వాహకులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement