● జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర
దామెర: శాసీ్త్రయ పద్ధతిలో పంట దిగుబడిని అంచనా వేయాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మండలంలోని పసరగొండలో గురువారం వరి దిగుబడిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటకోత ప్రయోగంలో భాగంగా ఎంపిక చేసిన సర్వే నంబర్ భూమిలో శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో సుమారు 13.250 కిలోల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. కాగా, ఎకరాకు అంచనా వేయగా.. 21 నుంచి 22 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశశం ఉందని స్పష్టం చేశారు. పంట కోత ప్రయోగాల ద్వారా పంట వాస్తవ దిగుబడి ముందే అంచనా వేయొచ్చన్నారు. ఆయన వెంట పరకాల ఏడీఏ అవినాష్ వర్మ, మండల వ్యవసాయ అధికారి అల్లె రాకేశ్ ఏఈఓలు రామకృష్ణ, అరుణ్‌కుమార్, రైతులు తదితరులు ఉన్నారు.


