రైతులను బ్యాంకులు ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతులను బ్యాంకులు ఆదుకోవాలి

Nov 5 2026 12:40 AM | Updated on Nov 5 2026 12:40 AM

న్యూశాయంపేట: కరువు ప్రభావిత రైతులను బ్యాంకులు ఆదుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద బ్యాంకు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ సమావేశంలో రైతులకు అందించాల్సిన ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన రైతుల పంట రుణాలు పునఃర్వ్యవస్థీకరణ, రుణ చెల్లింపు గడువు పొడిగింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు కొత్తపంట రుణాల మంజూరు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క రువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులను గు ర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎ ల్‌.కిశోర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, యూనియన్‌ బ్యాంకు డీజీఎం జి.కమలాకర్‌, ఆర్‌బీఐ ఎల్‌డీఓ యశ్వంత్‌, నాబార్డ్‌ డీడీఎం చైతన్య రవి, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజ ర్‌ జి.జీవన్‌కుమార్‌, వ్యవసాయ, పశుసంవర్థక, ఉ ద్యాన, మత్స్యశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement