న్యూశాయంపేట: కరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాసీ్త్రయంగా అంచనా వేయాలని, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లాను మొత్తంగా అధిక కరువు ప్రాంతంగా ప్రకటించాలని, కేంద్రం రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల కరువు నిధి ఇవ్వాలని కోరారు. జిల్లాలో కేవలం 8 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించడం, మిగితా వాటిని ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. అంతకుముందు హనుమకొండలోని ఏకశిల పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో విజయలక్ష్మికి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సాంబయ్య, ప్రతాప్, రాగసుధ, సంధ్య, కొంరయ్య, మల్లికార్జున్, జగదీశ్వర్, నరసయ్య, ఓదెలు, ఇస్మాయిల్, నాగేశ్, ప్రభాకర్, సురేశ్, నర్సయ్య, గణేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి
పెద్దారపు రమేశ్
కలెక్టరేట్ ఎదుట ధర్నా..
డీఆర్వోకు నాయకుల వినతిపత్రం


