కేయూ క్యాంపస్: కేయూలోని స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో వరంగల్ జోన్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌ను వీసీ ప్రతాప్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈక్రికెట్ టోర్నమెంట్‌లో 10 కళాశాలల క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ఈనెల 6వ తేదీ వరకు టోర్నమెంట్ కొనసాగనుందని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ శాస్త్రి తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు త్వరలో జరగనున్న కేయూ అంతర్ కళాశాలల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడా పోటీల ఇన్‌చార్జ్ డాక్టర్ ఎస్.కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు మట్టెడ కుమారస్వామి, అఫ్షల్ అస్లాం, డాక్టర్ ఏటీబీటీ ప్రసాద్, కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ సభ్యులు లాల్‌పాషా, సుమన్, అన్వేశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


