‘భీమదేవరపల్లి’ విద్యార్థులకు నేటినుంచి అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

‘భీమదేవరపల్లి’ విద్యార్థులకు నేటినుంచి అల్పాహారం

Nov 5 2026 12:40 AM | Updated on Nov 5 2026 12:40 AM

‘భీమదేవరపల్లి’ విద్యార్థులకు నేటినుంచి అల్పాహారం వైఎస్సార్‌ నగర్‌ భూములపై చిల్లర మాటలొద్దు

విద్యారణ్యపురి: భీమదేవరపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటి(గురువారం) నుంచి ‘అల్పాహారం’ పథకం అమలు చేయనున్నట్లు డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌ గౌడ్‌ బుధవారం తెలిపారు. కొత్తకొండ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో తనతోపాటు అడిషనల్‌ కలెక్టర్‌ పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

కాజీపేట: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి కూడా వైఎస్సార్‌ నగర్‌ కాలనీలో పట్టాలు ఇప్పించలేకపోయిన నాయకులు నేడు రాజకీయ లబ్ధ్ది కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటీ 62వ డివిజన్‌ సోమిడిలోని ఎస్సీ కాలనీలో బుధవారం రూ.17 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వైఎస్సార్‌నగర్‌ కాలనీ భూమి ప్రైవేటుదైతే తాను జోక్యం చేసుకోబోనని, ప్రభుత్వ భూమిగా తేలితే గజం స్థలం కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌ యాదవ్‌, సుంచు అశోక్‌, మెరుగు రాజయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement