హన్మకొండ అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖలో మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) సంతకాన్నే ఫోర్జరీ చేసి ఓ సర్టిఫి కెట్ జారీ చేసినట్లు ఆలస్యంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో కార్యాలయ సిబ్బంది పాత్ర ఉన్న ట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవా ల్సిన అధికారులు ఆ దిశగా ముందడుగు వేయకపోవడం, కొందరు తెరవెనుక వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఎలా తెలిసిందంటే..
కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి నేరుగా హనుమకొండ డీఎంహెచ్‌ఓను కలిసి తమ కుటుంబ సభ్యుడికి సంబంధించిన ఓ సర్టిఫికెట్‌ను చూపించారు. అది సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించిన సర్టిఫికెట్ అని, వాస్తవానికి రాష్ట్ర విద్యా విధానానికి సంబంధించిన సర్టిఫికెట్‌పై డీఎంహెచ్‌ఓ సంతకం కావాలని వివరించారు. ఆ సర్టిఫికెట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారి దానిపై ఉన్న సంతకం తనది కాదని గుర్తించి ఆశ్చర్యపోయారు. అధికారులు లోతుగా పరిశీలించగా కార్యాలయానికి సంబంధించిన ముద్రలను దుర్వినియోగం చేయడంతో పాటు ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
కిందిస్థాయి సిబ్బందిపైనే చర్యలా?
ఈ వ్యవహారంలో కార్యాలయంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపితే పలువురి పాత్ర వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో అధికారులు తొలుత ఆచి తూచి వ్యవహరించినట్లు సమాచారం. తెరవెనుక కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సద్దుమణిగేలా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ వారిని బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సర్టిఫికెట్ కోరిన వ్యక్తికి అవసరమైన ధ్రువపత్రంపై అసలు సంతకంతో మరో సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసింది.
విద్యా విధాన ధ్రువపత్రంపై నకిలీ సంతకం..
జిల్లా వైద్యారోగ్యశాఖలో కలకలం
ఆలస్యంగా గుర్తించిన అధికారులు
ఈ వ్యవహారంలో కార్యాలయ
సిబ్బంది పాత్రపై అనుమానాలు
బాధ్యులపై చర్యలకు వెనుకడుగు.. తెర వెనుక చక్రం తిప్పిన వారెవరు?
అసలు బాధ్యులెవరు?
ఫోర్జరీ సంతకం చేసింది ఎవరు? కార్యాలయ ముద్రలను దుర్వినియోగం చేసింది ఎవరు? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. అసలు వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో విచారించకుండా కొందరిపై చర్యలతోనే ముగించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నకిలీ సంతకం, ముద్రల దుర్వినియోగానికి పాల్పడిన వారితో పాటు తెరవెనుక సహకరించిన వారి పాత్రను కూడా వెలికితీయాలని వైద్య ఆరోగ్యశాఖలోని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.


