ఆత్మకూరు: మోడల్ గ్రామంగా అక్కంపేటను తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామంలోని రామాలయంలో వీబీజీ రాంజీ పథకంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. కోదండరామాలయంలో దర్శనం చేసుకున్నారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్‌ని సర్పంచ్ ముద్దం సాంబయ్య, గ్రామస్తులు సన్మానించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్దిపనులకు సంబందించిన డీపీఆర్‌లను త్వరగా అందించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రం, పీఎం శ్రీ స్కూల్‌ను సందర్శించారు.మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో జరుగుతున్న భూరీసర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముద్దం సాంబయ్య, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ విజయ్‌కుమార్, ఏఈఓ యాదగిరి, పీఆర్ ఏఈ బాబురావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రంజిత్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ సుదర్శన్, ఏపీఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
ప్రతిపాదిత అభివృద్ధి పనుల పరిశీలన


