హన్మకొండ: బాలల అక్రమ రవాణా నిర్మూలనకు ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ కె.వసుధ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో బాలల అక్రమ రవాణా నిర్మూలనపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ఆయా సంస్థల ప్రతినిధులు ఫాదర్ కోసి, డాక్టర్ అనితారెడ్డి, పరశురాములు, మహబూబాబాద్ జిల్లా చైల్డ్ వెల్ఫే కమిటీ చైర్మన్ డాక్టర్ నాగవాణి, ఎఫ్‌ఎఫ్‌ఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు శ్రీకాంత్, బత్తుల కరుణ, నవజీవన్ సంస్థ ప్రతినిధులు కరుణాకర్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.


