నాణ్యతా ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి

సంగెం: ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరం నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రాజారెడ్డి చెప్పారు. మండలంలోని తీగరాజుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాన్ని మంగళవారం సందర్శించి పరిశీలించారు. అనంతరం, లెప్రసీ కేసుల గుర్తింపు సర్వేను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించి కుష్టువ్యాధికి సంబంధించిన అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. గుర్తించిన వారికి సకాలంలో పరీక్షలు, నిర్ధారణ చేసి అవసరమైన వైద్య సేవల కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెఫర్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గోపాల్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, ఏఎన్‌ఎం సునంద తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య మహిళా క్లినిక్‌లో తనిఖీ

పర్వతగిరి: పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా క్లినిక్‌ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు క్లినిక్‌లోని రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు, ప్రయోగశాల సేవలు, టీకాల నిల్వకు సంబంధించిన కోల్డ్‌ చైన్‌ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మహిళా క్లినిక్‌కు వచ్చే మహిళలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్‌ వి.ఉదయ్‌రాజ్‌, డాక్టర్‌ జె.మౌనిక, నర్సింగ్‌ ఆఫీసర్‌ కె.రాజిత, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement