వానరాల వీరంగం | - | Sakshi
Sakshi News home page

వానరాల వీరంగం

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

కోతుల ప్రభావిత గ్రామాల వివరాలు ఇలా..

పంచాయతీరాజ్‌ శాఖ సర్వేలో ఆసక్తికర అంశాలు

సాక్షి, వరంగల్‌: జిల్లాలో దాదాపు అన్నిచోట్ల కోతుల సంచారం ఉంది. పంట పొలాల్లోకి వానరాలు గుంపులుగా చొరబడటం.. ఇళ్ల ఆవరణల్లోని పండ్ల చెట్లు, కూరగాయల మొక్కలను ధ్వంసం చేయడం.. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడడం.. కొన్నిచోట్ల ప్రజలకు ఇబ్బందులు కలిగించడం పరిపాటిగా మారింది. అయితే, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి లేదు. కొన్ని గ్రామాల్లో కోతుల సంచారం ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాటిని తరిమేస్తున్నారు. మరికొన్ని చోట్ల వాటి జాడే లేదని పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించిన మంకీస్‌ మెనెస్‌ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని 317 గ్రామ పంచాయల్లో 307 చోట్ల కోతుల సంచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

342 కోతుల దాడుల కేసులు

266 ç³…^éĶæ$-¡ÌZÏ ç³…r ¯]lçÙt… fÆý‡$-VýS$-™èl$-¯]l²r$Ï, 260 ^ørÏ {ç³fÌSMýS$ Cº¾…-§ýl$-Ë$ G§ýl$-Æý‡-Ð]l#-™èl$-¯]l²r$Ï çܧýlÆý‡$ çÜÆó‡Ó-ÌZ A«¨M>Æý‡$-Ë$ õ³ÆöP-¯é²Æý‡$. AÌêVóS, 10{V>Ð]l$ ç³…^éĶæ$-¡ÌS ç³Ç«¨ÌZ Mø™èl$ÌS çÜ…^éÆý‡Ðól$ Ìôæ§ýl° ™ólÍa^ðl-ç³µyýl… ÑÔóæçÙ…. §ýl$VöY…yìl Ð]l$…yýl-ÌS…ÌZ BÆý‡$, ¯]lÌS-Ï»ñæ-ÍÏ Ð]l$…yýl-ÌS…ÌZ Æð‡…yýl$, ¯]lÆý‡Þ…õ³r, çÜ…VðS… Ð]l$…yýl-ÌêÌZÏ JMøP ç³…^éĶæ$¡ ^ö糚¯]l D gê¼™éÌZ E¯é²Æ‡$$. {VóSrÆŠ‡ Ð]lÆý‡…-VýSÌŒæ M>Æöµ-Æó‡-çÙ¯ŒS-ÌZ Mø™èl$ÌS »ñæyýl§ýl Æð‡sìæt…Oò³…§ýl° „óS{™èl-Ýë¦Æ‡$$ ç³Çíܦ-™èl$-Ë$ ^ðlº$™èl$-¯é²Æ‡$$. D VýS×ê…M>Ë$ Ðé¯]l-Æ>ÌS »ñæyýl§ýl ¡{Ð]l-™èl¯]l$ ™ðlÍĶæ$-gôæ-çÜ*-¢¯ól.. Mö°² {V>Ð]l*-ÌZÏ ç³Çíܦ-™èl$-Ë$ À¯]l²…V> E…§ýl° çܵçÙt-Ð]l$-Ð]l#-™ø…¨. Ððl$gêÈt {V>Ð]l*-Ë$ Ð]l*{™èl… Mø™èl$ÌS »ñæyýl-§ýl-™ø Cº¾…¨ ç³yýl$-™èl$-¯é²-Ķæ$° D çÜÆó‡Ó ^ðlº$™ø…¨. D Hyé¨ f¯]l-Ð]lÇ ¯]l$…_ AMøtºÆŠæḥÐ]lÆý‡MýS$ 342 Mø™èl$ÌS §éyýl$ÌS MóSçÜ$-Ë$ ¯]lÐðl*§ýl$ M>Ð]lyýl… B…§øâýæ¯]l MýSÍWÝù¢…¨. A¯]l-«¨M>Ç-MýS…-V> D çÜ…QÅ Ð]l…§ýlÌS çÜ…QÅÌZ¯ól E…yól AÐ]l-M>Ôèæ-Ð]l¬…¨. D çÜÆó‡Ó B«§é-Æý‡…-V> {糿¶æ$-™èlÓ… H… ^èlÆý‡Å-Ë$ ¡çÜ$-MýS$…sZ…§ýl-¯]l° {ç³fË$ BçÜ-MìS¢-V> G§ýl$-Æý‡$-^èl*-çÜ$¢-¯é²Æý‡$.

ఆ గ్రామాలు కాస్త ‘పది’లం

జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో 307 గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తుండగా, 10 గ్రామాల్లో మాత్రం కోతుల జాడే లేదని సర్వే పేర్కొంది. దుగ్గొండి మండలంలోని శివాజీ నగర్‌, అడవి రంగాపూర్‌, బబ్బురోనిపల్లి, చంద్రాయిపల్లి, పీజీ తండా, తొగర్రాయి, నల్లబెల్లి మండలంలోని ఆసరవెల్లి, కొండాయిపల్లి, నర్సంపేట మండలంలోని జీజీఆర్‌ పల్లి, సంగెం మండలంలోని పోచమ్మ తండాల్లో పెద్దగా కోతుల సంచారం లేదని పంచాయతీ అధికారులు తేల్చారు. కోతులు ఉండేందుకు ఆవాసాలు, పెద్ద చెట్లు ఉండకపోవడం, రహదారిని ఆనుకొని ఉండడం, ఆహార వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడా పడేయకుండా పంచాయతీ వాహనంలోనే వేయడం వంటి జాగ్రత్తల వల్ల కోతుల ప్రభావం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.

జిల్లాలో 307 గ్రామ పంచాయతీల్లో గుంపులుగా సంచారం

266 జీపీల పరిధిలో పంట నష్టం.. 260 చోట్ల ప్రజలకు ఇబ్బందులు

4మండలాల్లో 10 పంచాయతీలకు బెడద లేదని వెల్లడి

వరంగల్‌ మంకీఫుడ్‌ కోర్టులో

కానరాని కోతులు.. నగరంలో హల్‌చల్‌

మా ఊరిలో కోతుల బెడద లేదు

సుమారు 500 మంది జనా భా ఉన్న మా గ్రామంలో ని ఇళ్లు ఒక దగ్గర కాకుండా దూ రం దూరంగా ఉంటాయి. ఆ హార వ్యర్థాలను ఎక్కడపడి తే అక్కడ పారబోయకుండా పంచాయతీ వాహనంలోనే వేస్తాం. కోతులు నివాసం ఉండడానికి పెద్ద చెట్లు లేవు. పండ్ల తోటలు లేవు. గ్రామంలో చెరువు వసతి లేకపోవడం కూడా కోతులు ఇక్కడికి రాకపోవడానికి మరో కారణం. పంట పొలాలకు కోతులతో ఎలాంటి ఇబ్బంది లేదు.

– బూరుగుల నాగేశ్వరరావు, రైతు,

శివాజీ నగర్‌, దుగ్గొండి మండలం

కోతులే లేని ‘మంకీ ఫుడ్‌ కోర్ట్‌’

నగరంతో పాటు శివారుల్లో కోతుల బెడద తగ్గించాలనే ఉద్దేశంతో వరంగల్‌ కరీమాబాద్‌లోని ఉప్పరోని కుంటలో ఎకరం 10 గుంటల చెరువు శిఖం భూమిలో 2018లో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్‌ కోర్ట్‌తో ఎలాంటి ప్రయోజనం లేదు. అక్కడ కోతుల కోసం నేరేడు. జామ, సపోటా, అరటి, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, లక్ష్మణ ఫలం, రామ ఫలం, మారేడు, మామిడి.. ఇలా మొత్తం 1,200 రకాల మొక్కలు పెంచితే ఇప్పుడవి వృక్షాలుగా మారినా అక్కడ కోతుల జాడే లేదు. మంకీ ఫుడ్‌ కోర్ట్‌ గురించి కార్పొరేషన్‌ ఎంత గొప్పగా చెబుతున్నా ఆచరణలో మాత్రం శూన్యమనే చెప్పొచ్చు. రూ.లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్‌కోర్ట్‌ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. నగరంలోని అనేక కాలనీల్లో వానరాలు గుంపులుగా సంచరిస్తూ, ఇళ్లపైకి ఎక్కుతూ, దుకాణాల్లోకి చొరబడుతూ, మనుషులపై దాడులు చేస్తున్నాయి. కోతులు పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement