న్యూశాయంపేట: జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సేకరించే గణాంకాలు భవిష్యత్ ప్రణాళికలకు కీలక ఆధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా రెండోదశ జనగణన నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనగణన ప్రాముఖ్యత, జనాభా గణన నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాచార సేకరణలో కచ్చితత్వం, పారదర్శకత, అధికారుల బాధ్యత తదితర అంశాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌కు చెందిన జిల్లా సెన్సెస్ ఆపరేషన్స్ విభాగం ఎస్‌ఓ శిక్షణాధికారి సతీష్ హాజరై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేష్, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణితో పాటు ముఖ్య ప్రణాళికాధికారి చంద్రకళ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్నబ్ తుపాన్‌తో
అప్రమత్తంగా ఉండాలి
న్యూశాయంపేట: అర్నబ్ తుపాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. తుపాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని లోతట్టు, వరద ముంపు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 4253424, 91542 52936 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
రెండో దశ జనగణనపై
అధికారులకు శిక్షణ


