బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాట్లు

Oct 4 2026 11:01 AM | Updated on Oct 4 2026 11:01 AM

● మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి

వర్ధన్నపేట : పట్టణంలోని రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ, దసర వేడుకల నిర్వహణకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి తెలిపారు. పట్టణంలోని రంగలీలా మైదానాన్ని మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి శనివారం ఆయన సందర్శించి పరిశీలించారు. మైదానంలో బారికేడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, వాహన పార్కింగ్‌, తదితర సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. బతుకమ్మల నిమజ్జన ప్రాంత శుభ్రత, విద్యుత్‌ దీపాలు, తదితర సౌకర్యాలపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం సారంగపాణి మాట్లాడారు. సకాలంలో వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బెజ్జం పాపారావు, టౌన్‌ ప్లాన్‌ అధికారి రాజ్‌కుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌, రెవెన్యూ అధికారి శ్రవణ్‌కుమార్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ అనిల్‌, నాయకులు నేతావత్‌ రాజేందర్‌, తిరుపెల్లి వాణి కుమార్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు బక్కతట్ల రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement