29న జిల్లా స్థాయి చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

29న జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 29న అండర్‌ –7, 9, 11, 13, 15 విభాగాల్లో జిల్లా స్థాయి చదరంగ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహణ కార్యదర్శి పి.కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించే ఈ పోటీలను వరంగల్‌ దేశాయిపెట్‌ రోడ్డులోని ఒయాసిస్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2011న ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఇందులో గెలుపొందిన బాలబాలికలకు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

ఎంపిక

గీసుకొండ: నగరంలోని శంభునిపేటలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీల్లో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 16వ డివిజన్‌ ధర్మారం జెడ్పీఉన్నతపాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి రామ్‌చరణ్‌ షాట్‌పుట్‌ విభా గంలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వై.సాంబయ్య రామ్‌చరణ్‌కు సర్టిఫికెట్‌, షీల్డ్‌ అందించి అభిందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పీజీ మొదటి దఫా

సీట్ల కేటాయింపు

నర్సంపేట రూరల్‌: నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 సంవత్సరానికి గాను జనరల్‌ మెడిసిన్‌ 4, సీ్త్రల వైద్య విభాగంలో 4 సీట్లకు గాను మొదటి దఫా జనరల్‌ మెడిసిన్‌లో 1 సీటు, సీ్త్రల వైద్య విభాగంలో 2 సీట్లు కేటాయించి బుధవారం అడ్మిషన్‌ పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సంధ్య తెలిపారు. ఓబీజీ విభాగానికి చెందిన మొదటి పీజీ విద్యార్థినిగా డాక్టర్‌ శ్వేతతోపాటు మరో పీజీ విద్యార్థి అడ్మిషన్‌ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దామోదరాబాయి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, హెచ్‌ఓడీలు పూనమ్‌ కుమారి, సుజాత, శ్రీనివాస్‌ విజయ్‌కుమార్‌, రాజేష్‌ ఖన్నా, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడాలి

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌

వర్ధన్నపేట: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి పోరాడాలని, బూత్‌ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, రాష్ట్ర సహ సంఘటన మంత్రి దశరథ జీ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని ఇల్లందలో బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు అడుప రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం సమ్మాన్‌ నిధి, పంటల బీమా, ఎరువుల సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి చేరవేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనను విస్మరించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్‌, కార్యదర్శి ఆర్‌.కుమారస్వామి, ఎం.కపిల్‌ కుమార్‌, మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల రెడ్డి, రాముండ్ల బాబురావు, ఉసిల్ల దయాకర్‌, నాంపల్లి యాకయ్య, మైసా రాము, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement