నెక్కొండ: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి సమస్య తీవ్రంగా అంటుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని నర్సంపేట డీఎల్పీఓ రాజీవ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని సా యిరెడ్డిపల్లిలో కమ్యూనిటీ సోప్ పిట్ నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలోని వాట ర్ ప్లాంట్ నుంచి వచ్చే నీరు వృథాగా పోకుండా కమ్యూనిటీ సోప్ పిట్ నిర్మాణం చేట్టడం అభినందనీయమన్నారు. నీటి వనరులను పొదుపుగా వాడుకొని రానున్న రోజుల్లో ఎల్‌నినోను ఎదుర్కోవడాని కి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. సర్పంచ్ బండారుపల్లి వినయకుమారి, పెండ్లి రవి, కార్యదర్శి కవిత, టీఏ, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు.


