న్యూస్‌రీల్
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
బొడ్డెమ్మ బొడ్డెమ్మా.. కోల్
బొడ్డెమ్మ.. తెలంగాణ సంస్కృతీసంప్రదాయానికి ప్రతీక. బతుకమ్మకు తొమ్మిది రోజుల ముందు వచ్చే బొడ్డెమ్మ వేడుక నేటి (గురువారం) నుంచి ప్రారంభంకానుంది.
వర్షపాతం తగ్గినా సగటున 1.12 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు
సాక్షి, వరంగల్: జిల్లాలో లోటు వర్షపాతం ఉన్నా ఈ వానాకాలం భూగర్భ జలాలు కొంత పెరిగాయి. జూన్‌లో భూమి ఉపరితలం నుంచి సగటున 6.53 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలమట్టం సెప్టెంబర్‌లో 5.41 మీటర్లకు చేరింది. అంటే నాలుగు నెలల్లో సగటున 1.12 మీటర్ల మేర నీటిమట్టం పైకి వచ్చింది. జిల్లాలోని 13 మండలాల్లో ఏర్పాటు చేసిన 26 పీజోమీటర్ల వద్ద సెప్టెంబర్‌లో నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో 2,95,300 ఎకరాలకు 2,75,500 ఎకరాల్లోనే పంటల సాగయ్యాయి. 19,800 ఎకరాల్లో సాగు తగ్గడం కూడా భూగర్భజల మట్టం రీచార్జ్‌కు కూడా ఓ కారణమని భూగర్భజల విభాగాధికారులు చెబుతున్నారు. డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ (డీడబ్ల్యూఎల్‌ఆర్) గణాంకాల్లోనూ సెప్టెంబర్ సగటు 5.22 మీటర్లుగా నమోదైంది. అయితే గతేడాది (సెప్టెంబర్ 2025) సగటు జలమట్టం 2.61 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది 5.41 మీటర్లకు పడిపోవడం జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రతను సూచిస్తోంది.
మండలాల వారీగా నీటిమట్టం వివరాలు..
●ఖానాపురంలో జూన్‌లో 6.20 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం సెప్టెంబర్‌లో 2.92 మీటర్లకు చేరింది. దీంతో 3.28 మీటర్ల మేర నీరు పైకి వచ్చింది. వరంగల్ మండలంలో 4.51 మీటర్ల నుంచి 1.43 మీటర్లకు చేరడంతో 3.08 మీటర్ల మార్పు నమోదైంది. చెన్నారావుపేటలోనూ 1.96 మీటర్ల మేర మెరుగుదల కనిపించింది.
● పర్వతగిరిలో జూన్‌లో 11.59 మీటర్లుగా ఉన్న జలమట్టం జూలైలో 13.62, ఆగస్టులో 14.29 మీటర్లకు దిగువకు వెళ్లింది. సెప్టెంబర్‌లో మాత్రం 11.16 మీటర్లకు తిరిగి చేరింది. రాయపర్తిలో ఆగస్టులో 10.44 మీటర్లకు చేరిన నీటిమట్టం సెప్టెంబర్‌లో 7.09 మీటర్లకు మెరుగుపడింది. వర్షాల తీవ్రత, విరామం, భౌగోళిక పరిస్థితులు ప్రాంతానికి ఒక విధంగా ఉండడమే ఇందుకు కారణం.
బోర్లపై ఆధారపడే రైతులకు కొంత ఊరట...
భూగర్భ జలాలు పైకి రావడం బోర్లపై ఆధారపడే రైతులకు కొంత ఊరట అని చెప్పొచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు అవసరమైన సమయంలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది. నీటిమట్టం పైకి రావడంతో బోర్లు ఎండిపోయే ప్రమాదం కొంత తగ్గవచ్చు. భూగర్భ జలాల పెరుగుదలను చూసి ఈ వా నాకాలం పంటలకు నీటి కొరత ఉండదని చెప్పలేమని అధికారులు అంటున్నారు. వర్షాధార పంట లకు ప్రధానంగా నేలలోని తేమే ఆధారం. అక్టోబర్‌లో కురిసే వర్షాలు పత్తి, మొక్కజొన్న, వరి వంటి పంటల తుది దిగుబడిపై ప్రభావం చూపుతా యి. మరోవైపు తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, నేలలో అధిక తేమతో పంటలకు ఇబ్బందులు తలెత్తుతా యి. ప్రస్తుత భూగర్భజల పెరుగుదల సానుకూల సంకేతమే అయినా.. మిగిలిన సీజన్‌లో వర్షాలు, నేలతేమ, బోర్ల వినియోగంపైనే పంట దిగుబడులు ఆధారపడనున్నాయి.
31 శాతం లోటు వర్షపాతం..
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భూగర్భ జలాల వివరాలు (మీటర్లలో)
ఖానాపురం, వరంగల్ మండలాల్లో మూడు మీటర్లకు పైగా..
19,800 ఎకరాల్లో సాగు తగ్గడం కూడా రీచార్జ్‌కు ఓ కారణమే
ఈ ఏడాది వానాకాలంలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 27 వరకు జిల్లాలో 31 శాతం లోటు నమోదైనట్లు వాతావరణ విభాగ నివేదికలు పేర్కొంటున్నాయి. మొత్తం సీజన్‌న్‌లో లోటు ఉన్నా వర్షం తక్కువగానే కురిసిందని అర్థం కాదు. తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిసినప్పుడు వాటిలో కొంత భాగం నేలలోకి ఇంకి భూగర్భ జలాలను రీచార్జ్ చేయగలదు. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండే చెరువులు, కుంటలు, వాగులు, వ్యవసాయ భూముల నుంచి జరిగే చొరబాటు భూగర్భజలాలపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు రాయపర్తి మండలంలో సెప్టెంబర్ 12న 89.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అక్కడ భూగర్భ రీచార్జ్‌కు అవకాశం ఏర్పడింది. ఇలాం అప్పుడప్పుడు కురిసిన భారీ వర్షాలు మొత్తం సీజన్‌న్ వర్షపాతం లోటులో ఉన్నా స్థానికంగా భూగర్భ జలాల రీచార్జ్‌కు దోహదపడింది.
మండలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్
చెన్నారావుపేట 3.17 1.64 1.49 1.21
దుగ్గొండి 6.32 6.82 5.91 5.91
గీసుకొండ 6.90 6.91 6.33 6.27
ఖానాపురం 6.20 5.01 3.46 2.92
నల్లబెల్లి 6.12 6.16 5.92 5.42
నర్సంపేట 4.67 5.62 4.19 4.02
నెక్కొండ 3.32 3.28 3.28 2.30
పర్వతగిరి 11.59 13.62 14.29 11.16
రాయపర్తి 8.12 9.62 10.44 7.09
సంగెం 8.91 9.09 8.99 8.21
వర్ధన్నపేట 8.88 8.52 7.97 7.84
వరంగల్ 4.51 3.13 1.98 1.43
ఖిలా వరంగల్ 4.53 4.86 4.57 4.00


