రెండు పంటలకు నీరందిస్తా | - | Sakshi
Sakshi News home page

రెండు పంటలకు నీరందిస్తా

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

రెండు పంటలకు నీరందిస్తా

వేలేరు: గండిరామారం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలు తీసుకొచ్చి రెండు పంటలకు సాగునీరందిస్తానని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలకు గండి రామారం లిఫ్ట్‌–1 పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తానన్నారు. పైప్‌లైన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపా రు. ఇటీవల దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మ ణ్‌నాయక్‌ను పరామర్శించారు. అనంతరం పీచరలో ఇటీవల శివరాత్రి వెంకటలక్ష్మి మృతిచెందగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఆర్‌ఐ సురేందర్‌, సర్పంచ్‌లు యాదగిరి, అనిత, అశోక్‌, సాంబయ్య, ఏఎంసీ డైరెక్టర్‌ కత్తి సంపత్‌, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, రవీందర్‌, రాజేందర్‌, సంపత్‌, సిద్ధయ్య, శ్రీకాంత్‌, శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement