బియ్యం రీ సైక్లింగ్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

బియ్యం రీ సైక్లింగ్‌ దందా!

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

నర్సంపేట: సన్నబియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లో సన్న రకాల ధాన్యానికి డిమాండ్‌ పెరగడం, గత సీజన్‌ సన్న ధాన్యం లేకపోవడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు మిల్లర్లు సీఎంఆర్‌ పేరుతో భారీగా రీ సైక్లింగ్‌ దందా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దారి మళ్లిన సీఎంఆర్‌ ధాన్యం..

గత సీజన్‌లో ప్రభుత్వం 33 రకాల సన్న ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించి కొనుగోలు చేసింది. అందులో ఇప్పుడు 7 రకాలను మాత్రమే సన్న ధాన్యంగా గుర్తించింది. వీటిని సాగు చేస్తేనే బోనస్‌ అని ప్రకటించింది. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా, బీపీటీ వంటి సన్నరకం ధాన్యాన్ని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టించి అధిక ధరకు అమ్ముకున్నారు. తక్కువ నాణ్యత కలిగిన సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి సీఎంఆర్‌గా పెట్టారు. దీంతో చౌకధర దుకాణాల్లో రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వండితే ముద్దగా అవుతోంది. చల్లారక గట్టిగా మారడం, రుచిగా లేకపోవడంతో చాలా మంది తినడం లేదు. కొందరు కార్డుదారులు కిలో బియ్యాన్ని రూ.17 నుంచి రూ.18 చొప్పున దళారులకు అమ్ముకుంటున్నారు. అవి మళ్లీ రైస్‌ మిల్లర్ల వద్దకు చేరుతున్నాయి. వారు సీఎంఆర్‌కు పెట్టడంతో రీ సైక్లింగ్‌ దందా కొనసాగుతోంది.

నర్సంపేటలో ఇద్దరు

రైస్‌ మిల్లర్లపై ఫిర్యాదులు..

నాలుగు నెలల క్రితం నర్సంపేటలో ఇద్దరు రైస్‌ మిల్లర్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం ధాన్యం నిల్వ లు తక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు కేసులు పెట్టకుండా వారిని వదిలేయగా రెండు రోజుల్లో మిల్లర్లు అంత వరకు బియ్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్‌ ప్రభుత్వానికి పెట్టారు. నాణ్యత లేని బియ్యం రేషన్‌ కార్డుదారుల వద్దకు చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బియ్యం వ్యాపారులు, దళారులు అధికారులకు మామూళ్లు సమర్పించి వారి దందాను సులువుగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు దళారులకు బియ్యం కోసం అడ్వాన్స్‌గా నగదు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా, రెండు రోజుల క్రితం నెక్కొండలో భారీగా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే తరహా దందా యథేచ్ఛగా సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వరంగల్‌లో బియ్యం పట్టివేత..

వరంగల్‌ చౌరస్తా: ఇంతేజార్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలోని కోడూరు జ్ఞానేశ్వర్‌.. చెన్నారావుపేట మండలం కోనాపురం గాయత్రి రైస్‌మిల్లు యజమాని కుసుమ రవితో కుమ్మకై ్క పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొన్నట్లు గుర్తించి బుధవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జ్ఞానేశ్వర్‌ వద్ద సుమారు రూ. 86,450 విలువైన 2,470 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బియ్యంతోపాటు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్‌ ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, సీఐ శ్రీధర్‌, ఎస్సై వీరస్వామి పాల్గొన్నారు.

సీఎంఆర్‌ పేరుతో

కొంతమంది మిల్లర్ల అక్రమాలు

నర్సంపేట నియోజకవర్గంలో

కరువైన అధికారుల తనిఖీలు

రెండు నెలల్లో పెరిగిన క్వింటాలు బియ్యం ధరల వివరాలు.. (రూపాయల్లో)

6,000

6,600

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement