నిబంధనల మేరకు రీసర్వే చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు రీసర్వే చేయాలి

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

● అదనపు కలెక్టర్‌ రవి

శాయంపేట: సర్వే రికార్డుల ఆధారంగా రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను, సూచనలతో నిబంధనల ప్రకారం రీసర్వే చేయాలని అదనపు కలెక్టర్‌ రవి అన్నారు. మండలంలోని హుస్సేన్‌పల్లిలో కొనగసాగుతున్న భూ రీ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా సర్పంచ్‌ స్వరూపసుధాకర్‌ రావు, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌రావు గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువు శిఖాలు ఆక్రమణకు గురయ్యాయని అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైనా ధ్వంసం చేస్తే పబ్లిక్‌ ప్రాపర్టీ డ్యామేజ్‌ యాక్ట్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం గోవిందాపూర్‌ శివారులోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ఆయన వెంట పరకాల ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌ఐలు చీమన్‌ నాయక్‌, రమేశ్‌, జీపీఓలు రవి, నరేశ్‌, దేవేందర్‌, కేజీబీసీ స్పెషల్‌ ఆఫీసర్‌ మాధవి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement