బస్టాండ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వండి

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

నర్సంపేట: నర్సంపేట, నెక్కొండ ఆర్టీసీ డిపోల అభివృద్ధి, పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్‌ను పునర్నిర్మాణం చేయడంతో పాటు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీంతో స్పందించిన ఎండీ రూ.5కోట్ల నిర్మాణ పనులకు మంజూరు ఇప్పిస్తానని, త్వరలో డీపీఆర్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ గంధం నరేందర్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌, డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ వేముల సాంబయ్యగౌడ్‌, చింతల సాంబరెడ్డి, వేముల సారంగంగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు. అనంత రం నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడి యం అభివృద్ధికి నిధులు కావాలని క్రీడా శాఖ మంత్రి శ్రీహరిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. దీంతో స్పందించిన మంత్రి రూ.2.5 కోట్లు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారన్నారు.

ఆర్టీసీ ఎండీని కోరిన

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement