న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
రైస్‌మిల్లర్ల వద్దే 2022–23 సీజన్ సీఎంఆర్
కలెక్టరేట్‌ను ప్రారంభించాలని వినూత్న నిరసన
జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీజేపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి.
రికవరీ
కావాల్సిన ధాన్యం:
1,11,634
మె.టన్నులు
వేలం వేసిన ధాన్యం జాడేది..
2022–23 రబీలో సీఎంఆర్ రైసుమిల్లర్లు ఎంతకు చెల్లించకపోవడంతో పౌరసరఫరాలసంస్థ.. 216 మిల్లుల్లో ఉన్న రూ.250.92 కోట్ల విలువ చేసే 1,11,634 మె.టన్నుల ధాన్యం మొత్తానికి వేలం వేసింది. తీరా టెండర్లు ముగిశాక వెళ్లి చూస్తే చాలా మిల్లుల్లో ధాన్యం లేకపోవడంతో మళ్లీ రికవరీపైనే దృష్టి సారించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాల సంస్థలు సంయుక్తంగా పోలీసుశాఖ సహాయంతో రంగంలోకి దిగడంతో కొంత మేరకు వసూలైనా.. ఇంకా రూ.కోట్లల్లో పెండింగ్ పడ్డాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 96 మిల్లుల వద్ద ఈ బకాయిలు ఉన్నట్లు నివేదిక పేర్కొంటోంది. జనగామ, వరంగల్ జిల్లాల్లో 54 మిల్లుల వద్ద బకాయిలు ఉన్నాయి. ములుగులో 13, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 24, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదు మిల్లుల వద్ద బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల సైతం కొందరు మిల్లర్లు బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ.. వసూళ్ల కోసం తదుపరి చర్యలపై చర్చ మొదలైంది. బకాయిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమా? రెవెన్యూ రికవరీ యాక్టు కింద చర్యలు తీసుకోవడమా? బకాయిదారుల ఆస్తులను గుర్తించి జప్తు ప్రక్రియ చేపటడమా? అన్న అంశాలు కీలకంగా మారాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన మిల్లర్లు కొందరిపై పోలీసు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
రికవరీ చేసిన
ధాన్యం:
37,825
మె.టన్నులు
ధాన్యం విలువ: రూ.250.92
కోట్లు
బకాయి ఉన్న
ధాన్యం:
73,809
మె.టన్నులు
సాక్షి ప్రతినిధి, వరంగల్:
రైతులనుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం.. రైసుమిల్లులకు కేటాయింపు.. మిల్లింగ్ చేసి సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగింత. ఇదీ సాధారణ ప్రక్రియ. కానీ ఉమ్మడి వరంగల్‌లో రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన లెక్కలు చూస్తే.. ధాన్యం కేటాయించి సుమారు మూడేళ్లు దాటినా రికవరీ మాత్రం పూర్తికాలేదు. కోట్ల రూపాయల విలువైన ధాన్యం, బియ్యం బకాయిలు మిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. సీఎంఆర్ చెల్లించని మిల్లుల్లో వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన లెక్కలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కాగితాలపై లెక్కలు.. మిల్లులు దాటని బకాయిలు..
పౌరసరఫరాల సంస్థ ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వ రంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇంకా ధాన్యం బకాయిలు ఉ న్నాయి. 216 మిల్లులకు ఇచ్చిన 1,11,634 మెట్రిక్ ట న్నుల ధాన్యానికి గాను 37,825 మెట్రిక్ టన్నులు మా త్రమే రికవరీ అయ్యాయి. మరో 73.809 మె.టన్నుల ధా న్యం మిల్లర్ల వద్ద ఉంది. విలువ పరంగా రూ.166.30 కోట్ల మేర రికవరీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పౌరసరఫరాల సంస్థ పేర్కొంది. రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన రికవరీ పూర్తికాకపోవడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
బకాయిదారుల ఆస్తులపై ‘విజిలెన్స్’ ఆరా!
భారీగా బకాయిలు పేరుకుపోవడంతో బకాయిదారుల ఆ స్తుల వివరాల సేకరణలో పౌరసరఫరాల సంస్థ, విజిలె న్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. కొందరు బకాయి ఉన్న రైసుమిల్లర్లు తమ స్థిర, చ రాస్తులను బినామీల పేరిట మార్పిడి చేశారన్న ప్రచారం ఉంది. మిల్లులను ఎత్తివేసి వాటి స్థానంలో ఫంక్షన్‌హాల్‌లు, సీడ్ మిల్లులుగా మార్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బకాయిదారుల ఆస్తుల వివరాల సేకరణ ‘విజిలెన్స్’ దృష్టి సారించాన్న చర్చ సర్వత్రా కలకలం రేపుతోంది. కాగా ఈ విషయమై ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని సంప్రదించగా సీరి యస్‌గా బకాయిల వసూళ్లు జరుగుతున్నాయని, తమను ఆ వివాదంలోకి లాగొద్దంటూ సమాధానం దాటవేశారు.
ఉమ్మడి జిల్లాలో రూ.166.30కోట్ల రికవరీ పెండింగ్..
జాడలేని 73,809 మె.టన్నుల
వేలం ధాన్యం
మొత్తం బకాయిలు 96 మిల్లుల వద్ద.. ప్రశ్నార్థకంగా మారిన వసూళ్లు
తెరపైకి క్రిమినల్ కేసులు..
ఆర్‌ఆర్ యాక్టులు..
బకాయిదారుల ఆస్తుల వివరాలపై ‘విజిలెన్స్’ ఆరా!
వసూలైన
మొత్తం:
రూ.84.61
కోట్లు
బకాయి
మొత్తం:
రూ.166.30
కోట్లు
ఇంకా
బకాయి ఉన్న
మిల్లులు:
96


