హెచ్‌పీవీ టీకాతో కేన్సర్‌కు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ టీకాతో కేన్సర్‌కు చెక్‌

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

ఖిలా వరంగల్‌: హెచ్‌పీవీ టీకాతో కేన్సర్‌కు చెక్‌ పడుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్‌ ఉర్సు గుట్టలోని ఎంజేపీటీ బీసీ డబ్ల్యూ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్‌తోట పీహెచ్‌సీ నేతృత్వంలో హెచ్‌పీవీ (హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా డీఎంహెచ్‌ఓ హాజరై వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి మా ట్లాడారు. కిశోర బాలి కల ఆరోగ్య పరిరక్షణలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కీలకమన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు టీకాపై అ వగాహన కలిగి ఉండాలని సూచించారు. 14–15 ఏళ్ల విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. అనంతరం వైద్యులు 51 మంది విద్యార్థులకు టీకా వేసి హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాలు, గ ర్భాశయ ముఖ ద్వారా కేన్సర్‌ నివారణలో టీకా పాత్రపై అవగాహన కల్పించా రు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అరుణ్‌జో షి, పీఓ డాక్టర్‌ అనిత, ప్రిన్సిపాల్‌ అంజిరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement