● కలెక్టర్ సత్యశారద
● బుధరావుపేట మోడల్ స్కూల్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ
ఖానాపురం: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. ఈ మేరకు మండలంలోని బుధరావుపేట మోడల్‌స్కూల్ బాలికల హాస్టల్‌ను మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్ అపరిశుభ్రత, బియ్యంలో పురుగులు ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యంపై వార్డెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. హాస్టల్‌పై నిత్య పర్యవేక్షణ చేపట్టాలని మండల అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ హాస్టళ్లలో మార్పులకు చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఇంటికి పంపాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే ఫిర్యాదుల పెట్టెలో వేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ పుష్పలత, డీటీడీఓ నారాయణరెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఎకై ్సజ్ సీఐ జయశ్రీ, తహసీల్దార్ నంగునూరి రమేష్, ఎంపీడీఓ వనపర్తి అద్వైత, ఎస్సై రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
న్యూశాయంపేట: మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్ చాంబర్‌లో వర్థన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు వీ హబ్ సంస్థ డైరెక్టర్ ఊహ, బృందం సభ్యులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన బ్రాండింగ్, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వీ హబ్ బృందం పర్వతగిరి మండంలోని పప్పు మిల్లు ఆధునీకరణ, వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఏర్పాటు చేయనున్న ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగ పద్మజ, ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్‌సాగర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


