వరంగల్ స్పోర్ట్స్: నేడు (శనివారం) వరంగల్ ఓ సిటీలోని మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–14, 17 బాలబాలికలకు ఉషు, తంగ్‌తా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి పుల్ల అనిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో అండర్–14, 17 బాలబాలికలకు లాన్‌టెన్నీస్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, బోనోఫైడ్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డుతో హాజరు కావాలని తెలిపారు.
● క్వింటాకు రూ.8,775 పలికిన ధర
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో 2026–27 సీజన్ నూతన పత్తి కోనుగోళ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా నల్లబెల్లి మండలం యం.వి తండాకు చెందిన జి.రమణ పత్తిని మార్కె ట్ యార్డుకు తీసుకొచ్చారు. జెండాపాట నిర్వహించి తొలి పత్తి క్వింటాకు రూ.8,775 ధర నిర్ణయించారు. కొత్త సీజన్‌లో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మంచి ధర రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈసందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంకతోపాటు పాలకవర్గ సభ్యులను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి సన్మానించారు.


