న్యూస్‌రీల్
శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురుతో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.
సాక్షిప్రతినిధి, వరంగల్ :
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకంలో వేలాది ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు కలిపి 48,787 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 27,477 (56.32 శాతం) ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో రూ.1,043.48 కోట్లు ఖర్చు చేసినట్లు అసెంబ్లీలో సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇంత మొత్తం వ్యయం జరిగినప్పటికీ మంజూరైన ఇళ్లలో సగానికి కొద్దిగా మించి మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది.
14,511 ఇళ్లు గ్రౌండింగ్ తర్వాతే..
ఉమ్మడి వరంగల్‌లో 41,988 ఇళ్లు గ్రౌండింగ్ అయినప్పటికీ వాటిలో 27,477 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే గ్రౌండింగ్ అయినా ఇంకా 14,511 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోలేదు. మరో 6,799 ఇళ్లు మంజూరైనప్పటికీ గ్రౌండింగ్‌కు రాలేదు. దీంతో మంజూరు చేసిన ఇళ్లను త్వరగా గ్రౌండింగ్‌కు తీసుకురావడంతోపాటు ఇప్పటికే పునాదులు పడిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి.
పెండింగ్ బిల్లుల విడుదలకు
వన్ టైమ్ క్లియరెన్స్..
ఇందిరమ్మ ఇళ్లలో నిర్దేశించిన స్లాబ్ ఏరియాను మించి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బేస్‌మెంట్ చెల్లింపులు నిలిపివేస్తున్నారా? అనే అంశంపై అసెంబ్లీలో ప్రశ్న వచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ నిబంధనలను సడలిస్తూ, పెండింగ్ బిల్లుల విడుదలకు వన్ టైమ్ క్లియరెన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. ఎవరైతే బేస్‌మెంట్ స్థాయి నిర్మాణం చేసుకున్నారో వారి ఇళ్లను ఎల్3 నుంచి ఎల్1 కేటగిరీలోకి మార్చి.. వెంటనే బిల్లులు చెల్లించనున్నారు. దీంతో బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం తగ్గి వేగం పుంజుకునే అవకావం ఉంటుందని గృహనిర్మాణ సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. తాజా నిర్ణయాల అమలుతో ఇళ్ల నిర్మాణం వేగం పెరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.
మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 99483 93391
మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ
జనగామ ములుగు జేఎస్ భూపాలపల్లి
పూర్తయినవి
గ్రౌండింగ్ అయి
పూర్తి కానివి
మంజూరు
గ్రౌండింగ్
గ్రౌండింగ్
కానివి
జనగామ జోరు.. భూపాలపల్లి వెనుకంజ
జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణం పూర్తి శాతంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
జనగామ జిల్లా 68.60 శాతంతో ముందంజలో ఉంది. ఇక్కడ 6,071 ఇళ్లు మంజూరు కాగా 4,165 ఇళ్లు పూర్తయ్యాయి.
మహబూబాబాద్ 63.16 శాతంతో రెండో స్థానంలో ఉంది. 11,218 మంజూరైన ఇళ్లలో 7,085 ఇళ్లు పూర్తయ్యాయి.
ములుగు 59.79 శాతం, హనుమకొండ 54.82 శాతం పూర్తి చేశాయి.
ఇక వరంగల్‌లో 47.64 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి 44.84 శాతంతో చివరి స్థానంలో ఉంది. అక్కడ 5,076 ఇళ్లు మంజూరు కాగా 2,276 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు అయిన ఖర్చు
ఆరు జిల్లాల్లో 48,787 మంజూరు.. 27,477 మాత్రమే పూర్తి
68.60 శాతంతో జనగామ టాప్.. 44.84 శాతంతో భూపాలపల్లి లాస్ట్
ప్రభుత్వం తాజా నిర్ణయాలతో
వేగం పెరిగేనా?
జిల్లాల వారీగా వ్యయమిలా..
(రూ.కోట్లలో)


