నల్లబెల్లి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక జిల్లా చైర్మన్ కె.మాధవరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం పరిష్కార వేదిక నిర్వహించారు. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట సెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై విద్యుత్ కార్యాలయంలో రాతపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా స్థానిక అధికారులు స్పందించకపోతే సీజేఆర్‌ఎఫ్ చైర్మన్ లేదా సభ్యులకు తగిన ఆధారాలతో ఫిర్యాదు సమర్పించవచ్చని పేర్కొన్నారు. పరిష్కరించకుంటే హైదరాబాద్‌లోని తెలంగాణ విద్యుత్ అంబుడ్స్‌మన్‌కు అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. సీజేఆర్‌ఎఫ్ సభ్యులు ఆర్.శేషారావు, సత్యనారాయణ, ఎస్‌ఈ ఆనందం, డీఈ తిరుపతి, ఏడీ లక్ష్మణ్, ఏఈ కృష్ణకాంత్ పాల్గొన్నారు.
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ మాధవరావు


