ఖిలా వరంగల్: సంగెం మండలం చింతలపల్లి సమీపంలో భారీ వర్షం కారణంగా బుధవారం రాత్రి రహదారిపై చెట్టు విరిగిపడింది. ఆసమయంలో బైక్‌పై విధులకు వెళ్తున్న రైల్వే ట్రాక్‌మెన్ మహేశ్‌పై చెట్టు పడగా గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే సిబ్బంది వెంటనే ఆయనను నగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న వరంగల్ బ్రాంచ్ సంఘ్ సెక్రటరీ బాలాజీ నాయక్, ట్రెజరర్ ఎండీ.రఫీ గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న మహేశ్‌ను పరామర్శించారు.


