రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ర్యాంకులిలా.. | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ర్యాంకులిలా..

Sep 16 2026 3:13 AM | Updated on Sep 16 2026 3:13 AM

● క్లస్టర్‌–1లో ఐదు పోలీస్‌ కమిషనరేట్లు ఉంటే హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మొదటి స్థానంలో ఉంటే, వరంగల్‌ కమిషనరేట్‌ రెండో స్థానంలో నిలిచింది. ● క్లస్టర్‌–3లో 11 పోలీసు యూనిట్లుండగా మహబూబాబాద్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ● క్లస్టర్‌–4లో 10 పోలీసు యూనిట్లుండగా జయశంకర్‌ భూపాలపల్లి 9, ములుగు 10వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన పోలీస్‌ యూనిట్ల మధ్య పనితీరు సూచీల్లో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది.

సాక్షి, వరంగల్‌ :

నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం.. ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్‌కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్‌ వైజ్‌ యూనిట్స్‌ పర్ఫార్మెన్స్‌ స్కోర్‌కార్డు’ ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలోని నాలుగు పోలీస్‌ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్‌ అమలులో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జ్‌షీట్ల నమోదులో మహబూబాబాద్‌ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement