సర్వే పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

Sep 16 2026 3:13 AM | Updated on Sep 16 2026 3:13 AM

ఖిలా వరంగల్‌: భూముల రీసర్వే మరింత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. మంగళవారం ఖిలావరంగల్‌ మండలం వసంతాపూర్‌లో జరుగుతున్న భూ రీసర్వేను అదనపు కలెక్టర్‌ కె.కిశోర్‌కుమార్‌, ఆర్డీఓ సుమ, ఏడీ సర్వే అధికారి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం భూముల సరిహద్దులు, సర్వే వివరాల నమోదు తదితర అంశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, భూ వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాల తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

న్యూశాయంపేట: దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జాతీయ ఇంజనీర్స్‌ డే సందర్భంగా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలోని విగ్రహానికి కలెక్టర్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజాపాలన దినోత్సవాన్ని

విజయవంతంగా నిర్వహించాలి

ఈ నెల 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశనం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌కుమార్‌, వై.వి.గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. అలాగే గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పనిచేస్తున్న కార్మికులకు, నర్సంపేట మెడికల్‌ కళాశాల నర్సింగ్‌ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement