‘సెప్టెంబర్‌ 17’ను అధికారికంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘సెప్టెంబర్‌ 17’ను అధికారికంగా నిర్వహించాలి

Sep 16 2026 3:13 AM | Updated on Sep 16 2026 3:13 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ

నర్సంపేట: సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో మరుపురా ని, మరుగున పరచలేని చారిత్రక ఘట్టమని, నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన రోజును తెలంగాణ దినోత్సవంగా గౌరవించడం ప్రతీ తెలంగాణ బిడ్డ బాధ్యతన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చారిత్రక దినోత్సవం అసలు స్ఫూర్తిని మరుగున పర్చడం ప్రజాపాలన కాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరా టం రెండూ ఒకటే కావని, వాటి లక్ష్యాలు, రాజకీ య నేపధ్యం, కాలపరిమితి, అంతిమ లక్ష్యాలు వేరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌, 28వ వార్డు కౌన్సిలర్‌ జూలూరి రోజారాణి, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ వడ్డేపల్లి నర్సింహరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీ నివాస్‌, నాయకులు రాంచందర్‌రెడ్డి, ఆంజనేయులు, రాజుయాదవ్‌, శంకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement