నీటిని పొదుపుగా వాడాలి | - | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపుగా వాడాలి

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

ఖానాపురం: పంటలకు నీటిని పొదుపుగా వాడాలని ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శాఖమూరి హరిబాబు, సొసైటీ చైర్మన్‌ వల్లె శ్రీనివాస్‌ కోరారు. మండలంలోని పాకాల సరస్సు నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నీటిని వృథా చేసుకోవద్దన్నారు. వరి పంట వేయని రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే ఇబ్బందులు తలెత్తవన్నారు. కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల జగన్‌మోహన్‌రెడ్డి, నర్సంపేట ఆత్మ చైర్మన్‌ ఎడ్ల భిక్షంరెడ్డి, ఐబీ డీఈ రమేశ్‌, సర్పంచ్‌ అచ్యుతం, నాయకులు లింగిడి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్‌రావు, ముస్తఫా, ఉపేందర్‌, శ్రీను, ఎల్లగౌడ్‌, లాల్‌సాహెబ్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో అలసత్వం వహిస్తే

చర్యలు : డీఎంహెచ్‌ఓ

నర్సంపేట రూరల్‌: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రాజారెడ్డి హెచ్చరించారు. నర్సంపేట పట్టణంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ హబ్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. హబ్‌లో పనిచేసే ముగ్గురు సిబ్బంది గైర్హాజరు కావడంతోపాటు సెలవుపత్రాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మీ వత్రం కావడంతో వారికి సంబంధించి సెలవుపత్రాలు వేరే రిజిస్టర్లలో దొరికాయి. మరోసారి ఇలా కాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎక్స్‌రే మిషన్‌ను పరిశీలించి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి పాతబ్లాక్‌లోని పీపీ యూనిట్‌ను సందర్శించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దామోదరబాయి, ఆర్‌ఎంఓ నవీన్‌ ఉన్నారు.

నిబంధనలు పాటించాలి..

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ఆదేశించారు. నర్సంపేటలోని ప్రైవే ట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సభ్యులతో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–2011, సంబంధిత రూల్స్‌–2022 అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, వాటికి సంబంధించిన టారిఫ్‌ వివరాలు స్పష్టంగా ప్రదర్శించే బోర్డులను రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రశాంత జీవనం గడపాలి

వరంగల్‌ లీగల్‌: వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడపాలని వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.ప్రదీప్‌ సూచించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదనం బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో న్యాయమూర్తి ప్రదీప్‌ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉందని తెలిపారు.

నూనె మిల్లు సీజ్‌

నల్లబెల్లి: అనుమతి, ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నగేశ్‌ నూనె మిల్లును సర్పంచ్‌ నాగెల్లి జ్యోతిప్రకాశ్‌, పంచాయతీ కార్యదర్శి నూతనకంటి ప్రశాంత్‌ శుక్రవారం సీజ్‌ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కుల నగేశ్‌ నిర్వహిస్తున్న నూనె మిల్లులకు ట్రేడ్‌ లైసెన్స్‌, సేఫ్టీ గార్డులు లేవని తెలిపారు. ఇటీవల రాంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత పల్లీలు పట్టించేందుకు మిల్లుకు వచ్చింది. ప్రమాదవశాత్తు మిల్లులో ఆమె కుడి చేయి ఇరుక్కొని జబ్బ వరకు కోల్పోయిందని తెలిపారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ స్పందించి నిర్వాహకుడికి 24 గంటల గడువుతో షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. నిర్వాహకుడి నుంచి వివరణ రాకపోవడంతో మిల్లును సీజ్‌ చేసినట్లు వారు పేర్కొన్నారు. అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, ప్రజాభద్రతను విస్మరించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement