సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

న్యూశాయంపేట: సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌)ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలకు చెందిన ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ఎస్‌ఐఆర్‌ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన పోలీంగ్‌ స్టేషన్లలో బీఎల్‌ఓలను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు. నోమ్యాపింగ్‌, అనామలీస్‌లో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీచేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద జిల్లాలో ఎస్‌ఐఆర్‌పై పీపీటీ ద్వారా వివరించారు. అంతకుముందు పోలింగ్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియ, బూత్‌ లెవల్‌ అధికారులు నిర్వర్తిస్తున్న విధులను కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

భారత ఎన్నికల సంఘం

కార్యదర్శి నవీన్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement