కాళోజీ సెంటర్: పలు కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్షర వెలుగులు నింపుతోంది. చదువుకోవాలని ఆసక్తి ఉన్నవారు అందుబాటులో ఉన్న ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లు పొంది సకాలంలో పరీక్ష ఫీజు చెల్లిస్తున్నారు. అయితే, కొన్ని సెంటర్ల కోఆర్డినేటర్లు అధిక ఫీజు వసూలు చేస్తూ బోర్డుకు ఫీజు చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ మట్టెవాడ ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో పరీక్ష ఫీజు చెల్లించకపోవడంతో కొంతమంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాము ఫీజు చెల్లించినా సెంటర్ బాధ్యులు పరీక్ష ఫీజు బోర్డుకు చెల్లించకపోవడంతో పరీక్ష రాయలేదని, దీంతో ఒక సంవత్సరం వృథా అయ్యిందని పేరు చెప్పడానికి ముందుకు రాని 16 మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మట్టెవాడ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్‌ను వివరణ కోరగా పొరపాటు జరిగినట్లు అంగీకరించడం కొసమెరుపు.
ఉమ్మడి జిల్లాలో 142 స్టడీసెంటర్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 142 స్టడీసెంటర్లు ఉన్నాయి. కొంతమంది కోఆర్డినేటర్లు విద్యార్థుల నుంచి రూ.1,500 బదులు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బయట చెబితే మీరు ఉత్తీర్ణత కారు అని విద్యార్థులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఎవరికి ఫిర్యాదు చేయలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మధ్యలో చదువు ఆపేసిన వారి అసరాలను ఆసరాగా చేసుకొని అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, తెలంగాణ ఓపెన్ స్కూల్ బోర్డుకు చెల్లించని స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లపై చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కొంతమంది తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ముద్రించిన బుక్‌లెట్‌లో పూర్తి సమాచారం పొందుపరిచారు. అందులో ఉన్న ఫీజు కంటే ఎవరు ఎక్కువ వసూలు చేసినట్లు సమాచారం ఇస్తే డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. మట్టెవాడ సెంటర్ కోఆర్డినేటర్ విషయంలో గతంలోనే చెప్పాము. ఎవరైతే ఫీజు కట్టి హాల్‌టికెట్ రాకుండా పరీక్షకు హాజరుకాలేదో వారు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం.
జిల్లాల వారీగా స్టడీ సెంటర్ల వివరాలు..
– సదానందం,
ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా వరంగల్ కోఆర్డినేటర్
హనుమకొండ
వరంగల్
ములుగు
విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకొని
బోర్డుకు చెల్లించని కొంతమంది
రూ.1,500కు బదులు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు
హాల్‌టికెట్ రాక పరీక్ష రాయకపోవడంతో ఒక సంవత్సరం వృథా
మట్టెవాడ ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో ఘటన వెలుగులోకి
28
26
25
20
18


