ఆలయాల్లో కుంకుమార్చన
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు
ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
జిల్లాలో వరలక్ష్మీ వ్రతాలను మహిళలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేశారు. పండ్లు, పూలు, పలు రకాల నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించారు. ఆలయాలు, ఇళ్లలో మహిళలు ముత్తెయిదువులకు వాయినాలు అందించారు. వరంగల్‌లోని భద్రకాళి, సంతోషిమాత, ఎంజీఎం ఎదుట ఉన్న రాజరాజేశ్వరి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
– సాక్షి, నెట్‌వర్క్
– మరిన్ని ఫొటోలు 9లో


