కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిధి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్.మాధవరావును నియమించారు. ఈమేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మాధవరావు ఎంజీఎం న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా పని చేస్తున్నారు. కాగా, డాక్టర్ మాధవరావు శనివారం స్వాతంత్ర దినోత్సవం రోజు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇంతకు ముందు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ అనిల్ బాలరాజు రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో భాగంగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు.


