వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎన్నికలకు నోడల్ అధికారిగా అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, నిర్వహణ కమిటీ సభ్యులుగా అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో కానిస్టేబుల్ కొండా కరుణాకర్ (ధర్మసాగర్ పోలీస్ స్టేషన్), ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ టి.బాబుపై 17 ఓట్ల అధిక్యంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.సతీశ్(ఆర్‌ఐ), బి.శరత్ కుమార్(ఆర్‌ఎస్‌ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ.వీరభద్రరావు (దామెర ఎస్‌ఐ), సంయుక్త కార్యదర్శిగా టి.నరేశ్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.ప్రవీణ్‌కుమార్ (ఏఆర్ కానిస్టేబుల్), కోశాధికారి బి.నరేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్), కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.తులసి (కానిస్టేబుల్ కాజీపేట), సీ.హెచ్ మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఏ.రమేశ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్.ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎండీ తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి.సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందనలు తెలిపారు. సభ్యుల సంక్షేమానికి పనిచేయాలని కోరారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా కరుణాకర్, వీరభద్రరావు
ఎన్నికల తీరును పరిశీలించిన
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత


